Thursday, December 26, 2024

29న దీక్షాదివస్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29వ తేదీన దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందని వ్యాఖ్యానించారు. 2009,నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టిఆర్‌ఎస్) అధ్యక్షులు కెసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని తెలిపారు.

దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో- కెసిఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండవర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని పేర్కొన్నారు. ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని అన్నారు. ఈ నెల 29న కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News