మన తెలంగాణ/హైదరాబాద్ : నదుల వెంట నాగరికత వర్ధల్లాలని సిఎం రేవంత్ రెడ్డి పే ర్కొన్నారు. నదులను కబళిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆయన అన్నారు. ప్ర పంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీని శాపంగా మిగిలిపోనివ్వమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రెండూ కీలకమేనని ఆయన తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయడానికి ప్రజాప్రభుత్వం ముందుకెళుతుందని ఎవరూ అడ్డువచ్చినా ఇది ఆగదన్నారు.
ఈ తరానికే కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకు ధ న్యవాదా లు అని ఆయన తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్ర భుత్వ విజ్ఞప్తి మేరకు ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కర్ణాటకకు చెందిన ఆనం ద్ హైదరాబాద్ వచ్చారు.మూడు రోజులుగా రాజధానిలో పర్యటిస్తున్నారు. హైడ్రా కమిషనర్ , జిహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఎ, జలమండలి ఉన్నతాధికారులతో కలిసి మురికి కూపాలుగా మారిన చెరువులను పరిశీలిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని చెరువులను పరిశీలిస్తున్న ఫొటోలను జతచేసి ముఖ్యమంత్రి రేవంత్ గురువారం ట్వీట్ పెట్టారు.