భారతీయ మార్కెట్‌లో మారుతి గ్రాండ్ విటారాను మారుతి సుజుకి ఎస్‌యూవీ విభాగంలో అందిస్తోంది. ఒకవేళ ఈ కారు బేస్ వేరియంట్ సిగ్మాని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి కొనుగోలు చేయవచ్చు. తర్వాత ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ధర
గ్రాండ్ విటారాను మారుతి నాలుగు మీటర్ల కంటే పెద్ద ఎస్‌యూవీ గా తీసుకువచ్చింది. ఈ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ సిగ్మా కంపెనీ భారతీయ మార్కెట్లో రూ. 10.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర (మారుతి గ్రాండ్ విటారా ధర) వద్ద అందిస్తోంది. ఈ కారును ఢిల్లీలో కొనుగోలు చేస్తే, దాదాపు రూ. 110730 RTO, సుమారు రూ. 37 వేల బీమాతో పాటు, TCS ఛార్జీగా రూ. 10990, MCD కోసం రూ. 4000, ఫాస్టాగ్‌కు రూ. 800 చెల్లించాలి. దీని తర్వాత మారుతి గ్రాండ్ విటారా సిగ్మా ఆన్ రోడ్ ధర దాదాపు రూ. 12.63 లక్షలు అవుతుంది.
2 లక్షల డౌన్ పేమెంట్ తర్వాత ఎంత EMI
ఈ వాహనం సిగ్మా వేరియంట్‌ని కొనుగోలు చేసినట్లయితే.. ఎక్స్-షోరూమ్ ధరలో మాత్రమే బ్యాంక్ ఫైనాన్సింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసిన తర్వాత, బ్యాంకు నుండి దాదాపు రూ. 10.63 లక్షల వరకు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు 9 శాతం వడ్డీతో ఏడేళ్లకు రూ.10.63 లక్షలు ఇస్తే, తర్వాత ఏడేళ్లపాటు ప్రతి నెలా రూ.17102 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
కారు ధర ఎంత
9 శాతం వడ్డీ రేటుతో ఏడేళ్ల పాటు బ్యాంక్ నుండి రూ. 10.63 లక్షల కారు లోన్ తీసుకుంటే ఏడేళ్ల పాటు ప్రతి నెలా రూ. 17102 EMI చెల్లించాలి. ఈ క్రమంలో మారుతి గ్రాండ్ విటారా సిగ్మా కోసం ఏడేళ్లలో సుమారు రూ. 3.73 లక్షలను వడ్డీగా చెల్లిస్తారు. దీని తర్వాత కారు మొత్తం ధర ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్, వడ్డీతో సహా దాదాపు రూ. 16.36 లక్షలు అవుతుంది.
ఈ కార్ల తో పోటీ
మారుతి అందిస్తున్న ఈ ఎస్‌యూవీ టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, మహీంద్రా స్కార్పియో వంటి ఎస్‌యూవీ లతో నేరుగా పోటీపడుతుంది.