Sunday, November 24, 2024

అధికార పక్షాలకే జై

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లు అధికార పక్షాలకే మళ్లీ పట్టం కట్టారు. మహారాష్ట్రలో బిజెపి సారథ్యంలోని మహాయుతి కూటమి అంచనాలకు మించి అఖండ విజయం సాధించింది. 288 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 234స్థానాలు గెలిచి ఇండియా కూటమి ఆశలపై నీళ్లు చల్లింది. జార్ఖండ్‌లో పగ్గాలు చేపట్టాలని కలలుగన్న కమలనాథులను అక్కడి ఓటర్లు కంగుతినిపించారు. జెఎంఎం, కాంగ్రెస్ కూటమికే అధికారం అప్పగించారు.

132స్థానాలతో మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన
బిజెపి మిత్రులతో కలిసి234 స్థానాల్లో జయకేతనం
నామమాత్ర పోటీ కూడా ఇవ్వలేకపోయిన కాంగ్రెస్
సారథ్యంలోని మహావికాస అఘాడి రాజకీయ
దురంధురుడు శరద్ పవార్‌కు శృంగభంగం 10
స్థానాలకే ఆయన పార్టీ పరిమితం చతికిలపడిన
బాల్‌ఠాక్రే వారసుడు ఉద్దవ్ జార్ఖండ్‌లో ఇండియా
కూటమికి ఘన విజయం మొత్తం 81స్థానాల్లో 56
చోట్ల విజయం సాధించిన జెఎంఎం కూటమి
ఉపపోరులోనూ అధికార పార్టీలదే హవా 46 అసెంబ్లీ
స్థానాల్లో 35 ఎన్‌డిఎకే పశ్చిమబెంగాల్‌లో
తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) క్లీన్‌స్వీప్

ముంబయి/రాంచీ: బిజెపి సారథ్యంలోని మహాయుతి శనివారం మహారాష్ట్రను కైవసం చేసుకుంది. ఒక ప్రతిపక్ష ఇండియా కూటమి జార్ఖండ్‌ను నిలబెట్టుకున్నది. రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్న పార్టీల హవా సాగింది. రెండు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వోట్ల లెక్కింపు శనివారం ఉదయం 8గంటలకు మొదలైంది. కానీ ఆ వెంటనే మహారాష్ట్రలో బిజెపికి వేడుకలకు నాంది పడిం ది. శక్తిమంతమైన రాష్ట్రంలో బిజెపి తాను పోటీ చేసిన 149 సీట్లలో సింహభాగాన్ని గెలుచుకుంది. భాగస్వామ్య పక్షాలు శివసేన, ఎన్‌సిపితో కలసి మహాయుతి కూటమి మొత్తం 288 సీట్లలోకి 236 సీట్లలో విజయ పతాకం ఎ గురవేసింది. కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి)తో కూడిన ఎంవిఎ కేవలం 47సీట్లకు పరిమితమైం ది. మహారాష్ట్రలో కంగు తిన్న ప్రతిపక్షానికి జార్ఖండ్ ఉపశమనం కలిగించింది. జెఎంఎం నాయకత్వంలోని కూట మి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. ఎ న్నికల కమిషన్ (ఇసి) వెబ్‌సైట్ ప్రకారం, 8

1 సీట్లు ఉన్న ఝార్ఖండ్ శాసనసభలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జెఎంఎం 35, కాంగ్రెస్, 16, ఆర్‌జెడి 4 సీట్లు, సిపిఐ (ఎంఎల్) ఒక సీటు వెరసి జెఎంఎం కూ టమి 56 సీట్లు దక్కించుకున్నది. ప్రతిపక్ష ఎన్‌డిఎ 24 సీ ట్లకు పరిమితం కాగా, ఇతరులకు ఒక సీటు లభించింది. మహారాష్ట్ర ఫలితాలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ, ‘విద్వేష, ప్రతీకార రాజకీయాలను జనం తిరస్కరించి, సంక్షేమ, అభివృద్ధి రాజకీయాలను అంగీకరించారు’ అని అన్నారు. ఇదిచరిత్రాత్మక దినం అని షిండే అభివర్ణిస్తూ, ‘మహాయుతికి అఖండ విజయం చేకూర్చేందుకు జనం ఎన్నికలను తమ చేతుల్లోకి తీసుకున్నారు’ అ ని అన్నారు. లాడ్కీ బహిన్ పథకం వంటి సంక్షేమ పథకా లే విజయానికి కారణంగా తమ కూటమి సహచరులు పేర్కొంటుండగా, షిండే కుమారుడు, శివసేన ఎంపి శ్రీ కాంత్ షిండే ఈ ప్రజల తీర్పు బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను ఎవరు ముందుకు తీసుకువెళుతున్నా రో సూచిస్తున్నదని అన్నారు. శివసేన వ్యవస్థాపకుని విభజిత వారసత్వ సంపదకు ఇది సంకేతం. ఆయన కుమారుడు ఉద్ధవ్ శివసేన (యుబిటి)కి సారథ్యం వహిస్తున్నారు.

ఇవిఎంల కుట్ర జరిగింది: రౌత్
మరొక వైపు శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ భిన్న వాదన చేశారు. ‘పెద్ద కుట్ర’ జరిగిందని, ఏదో ‘లోపాయికారీ వ్యవహారం’ ఉందని రౌత్ ఆరోపించారు. ఎన్నిక ల్లో ధనబలాన్ని ఉపయోగించారనే అనుమానం తన మనస్సులో ఉందని రౌత్ చెబుతూ, ‘ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రులు అందరూ ఎలా గెలిచారు? అజిత్ పవా ర్ ఎలా గెలవగలిగారు? ఆయన నమ్మకద్రో హం మహారాష్ట్రకు ఆగ్రహం కలిగించింది’ అని రౌత్ పేర్కొన్నారు. లోక్‌సభకు 48మంది ఎంపిలను పంపే ఎంవిఎకు నిర్ణయాత్మకంగా 30సీట్లు ఇచ్చిన, రాజకీయంగా ముఖ్యమై న పశ్చిమ రాష్ట్రంలో వోటర్లు కేవలం ఐదు నెలల క్రితం పార్లమెంటరీ విజయం సరలికి భిన్నంగా సాగాలని విస్పష్టంగా నిర్ణయించుకున్నారు. బిజెపి స్వయంగా మెజారిటీ సీట్లు సాధించగా, శివసేన 56, ఎన్‌సిపి 41 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇక ప్రతిపక్ష ఎంవిఎకు సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తీర్పు బిజెపికి కొత్త ఊ పు ఇచ్చింది. క్రితం నెల హర్యానాలో కనివిని ఎరగని రీతి లో హ్యాట్రిక్ విజయం సాధించిన బిజెపి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలు కొన్నిటిని అధిగమించింది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కేవలం 240 సీట్లు గెలుచుకుంది.

అందరి దృష్టి ఫడ్నవీస్ వైపే
ఎన్నికల ఫలితాలు తేలిన తరువాత అంద రి దృష్టి బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పైకి మళ్లింది. బిజెపి దిగ్భ్రాంతికర విజయానికి సూత్రధారి ఫడ్నవీస్. రాష్ట్రంలో సిఎం అ యిన రెండవ బ్రాహ్మణుడు మూడవ సారి ఆ పదవిని చే పట్టవచ్చుననే వార్తలు రాజకీయ వర్గాలలో వినవస్తున్నా యి. ‘మహాయుతి నేతలు (తదుపరి సిఎం)ను నిర్ణయిస్తారు’ అని ఫడ్నవీస్ తన వంతుగా చెప్పారు. ‘ఈ తీర్పు మొత్తం సమాజం ప్రధాని నరేంద్ర మోడీ వెనుక నిలబడుతుందని స్పష్టం చేస్తోంది. ‘ఏక్ హై తో సేఫ్‌హై’ నినాదం ముఖ్యంగా లాడ్కీ బహిన్‌లు (ప్రియతమ సోదరీమణులు)కు జయప్రదం అయింది. ఆ పథకం నుంచి వారు నె లకు రూ. 1500 అందుకుంటూ లబ్ధి పొందుతారు’ అని ఆయన తెలిపారు. మహాయుతి కూటమిల బిజెపికి ప్రా థమ్యం ఇస్తున్న మహారాష్ట్ర తీర్పు కాంగ్రెస్‌కు,

ఒకప్పుడు దీటులేని నేతగా పరిగణన పొందిన శరద్ పవార్‌కు ఆత్మావలోకనం చేసుకోవలసిన పరిస్థితిని కల్పిస్తోంది. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ వా ద్రా విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్‌కు మహారాష్ట్రలో ప్రతికూల ఫలితాలు విఘాతంలా పరిణమించాయి. ‘ఇది మాకు దారుణమైనది, భరించలేనిది. బిజెపి వారు చేసిన అద్భుత కృషి, సీట్ల పంపకం కారణంగా ఆధిక్యంలోకి వెళ్లింది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య బల్లాల్ పేర్కొన్నారు. అధికార మహాయుతి కూటమిలో బిజెపి 149 అసెంబ్లీ సీట్లకు, శివసేన 81 సీట్లకు, అజిత పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి 59 సీట్లకు పోటీ చేశాయి. ఎంవిఎ కూటమితో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన (యుబిటి) 95, ఎన్‌సిపి (ఎస్‌పి) 86 సీట్లకు పోటీ చేశాయి.

ప్రజాస్వామ్య పరీక్షలో ధ్‌టమి పాస్
కాగా, ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి గణనీయ ప్రదర్శన పట్ల రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరీక్షలో తమ కూ టమి పాస్ అయిందని ఆయన చెప్పారు. ‘మేం చేసిన కృషికిప్రజలతో మేము అనుబంధం కలిగి ఉన్న తీరుకు కూడా ప్రతిఫలం పొందబోతున్నాం’ అని కాంగ్రెస్ నేత రాజేశ్ ఠాకూర్ ‘పిటిఐ’ వీడియోలతో చెప్పారు. ఇక బి జెపి ఎన్నికల ప్రచార ఆయుధం సంథాల్ పరగణాల ప్రాంతం నుంచి ‘చొరబాటుదారులను’ పంపివేయడం. కానీ జెఎంఎం వాడిన ‘ఆదివాసీ’ కార్డు ముందు విఫలం అయింది. సోరెర్ అరెస్టుపై ప్రజల నుంచి సానుభూతిని జెఎంఎం పొందగోరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News