Monday, November 25, 2024

దివ్యాంగుల రిజర్వేషన్‌కు కేంద్రం మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

కనీసం 40 శాతం వైకల్యాలు ఉన్న వ్యక్తుల కోసం ఉద్యోగాల గుర్తింపునకు, రిజర్వేషన్ క్రమబద్ధీకరణకు కేంద్రం సమగ్ర మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. అటువంటి ఉద్యోగాలను క్రమానుగతంగా గుర్తించాలని, వాటిని మదింపు వేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఒక ఉద్యోగం వారికి అనువైనదని భావించినట్లయితే, ఆ తదుపరి పదోన్నతులు కూడా దివ్యాంగులకు రిజర్వ్ చేయాలని కూడా మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. 2016 నాటి దివ్యాంగుల హక్కుల (ఆర్‌పిడబ్లుడి) చట్టానికి తగినట్లుగా మార్గదర్శకాలు ఉన్నాయి.

2016 నాటి దివ్యాంగుల హక్కుల చట్టం అమలులో వైరుధ్యాలను ఢిల్లీ హైకోర్టు ఎత్తిచూపి, ఉద్యోగాల గుర్తింపులో అనధికార చర్యలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) వంటి సంస్థలను విమర్శించిన తరువాత కేంద్రం ఆ మార్గదర్శకాలను జారీ చేసింది. పిడబ్లుబిడిల కోసం ఉద్యోగాలను స్వతంత్రంగా గుర్తించడం ద్వారా కెవిఎస్ తన అధికారాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు ఈ నెలారంభంలో పేర్కొన్నది. వివిధ విభాగాల మధ్య చట్టం పట్ల అవగాహనలో వైరుధ్యాలు ఉన్నాయని హైకోర్టు తెలియజేసింది. ఏకీకృత మార్గదర్శక సూత్రాలు రూపొందించాలని దివ్యాంగుల సాధికారత విభాగాన్ని (డిఇపిడబ్లుడిని) కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News