Monday, November 25, 2024

సంభాల్ హింసాకాండపై హైకోర్టు విచారణ చేపట్టాలి: అసదుద్దీన్ ఒవైసీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొఘల్ కాలం నాటి మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండలో మరణాలను ఖండిస్తూ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఒక హై డిమాండ్ చేశారు. “దౌర్జన్యాలు జరుగుతున్నాయి” అని ఆరోపిస్తూ కోర్టు విచారణ చేపట్టాలని కోరారు. అంతేకాక  ఈ ఘటనకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు.

మసీదు ప్రజల మాట వినకుండా కోర్టు ఉత్తర్వులు జారీ చేశారని, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రెండో సర్వే నిర్వహించారని అసదుద్దీన్ ఆరోపించారు. కొన్ని వీడియోలను ప్రస్తావిస్తూ, సర్వే కోసం వచ్చిన వారు రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈరోజు ఇక్కడ విలేకరులతో ఒవైసీ మాట్లాడుతూ ‘సంభాల్‌లోని మసీదు 50-100 ఏళ్లనాటిది కాదు, ఇది 250-300 ఏళ్లకు పైగా ఉంది, మసీదు ప్రజల మాట వినకుండా కోర్టు ఎక్స్‌పార్ట్ ఆర్డర్ ఇచ్చింది, ఇది తప్పు. …రెండో సర్వే చేయగానే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు… సర్వే వీడియోలో రెచ్చగొట్టే నినాదాలు కనిపించాయి. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  ముగ్గురు ముస్లింలు మరణించారు, ఇది కాల్పుల వల్ల కాదు, ఈ హత్యను ఖండిస్తున్నాము, దీనిపై సిట్టింగ్ హైకోర్టు విచారణ జరపాలి’’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News