రూ.2,750కోట్లతో అటల్ ఇన్నోవేషన్
మిషన్ రూ.2,481కోట్లతో ప్రకృతి
వ్యవసాయంపై జాతీయ మిషన్
విశ్వవిద్యాలయాల్లో అందుబాటులోకి
జర్నల్స్, పరిశోధన పత్రాలు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పాన్‌కార్డులకు సం బంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. పా న్‌కార్డుల ఆధునీకరణకు కేంద్ర కేబినెట్ ఆ మోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గం సోమవారం ఈమేరకు ఆమోదం తెలిపింది. పాన్ 2.0 కి కేంద్ర కేబినెట్ ఆమోదించిన కోడ్‌తో పాన్‌కార్డుకు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయబడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మం త్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాన మం త్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆదాయ పు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రూ. 1435 కోట్ల వ్య యంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును రూ పొందిస్తున్నారు. పిఎఎన్ 2.0 ప్రాజెక్టు అనేది పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన డి జిటల్ అనుభవ సాంకేంతిక పరివర్తన ద్వా రా పన్ను చెల్లింపు దారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలు చేయడానికి ఇగవర్నెస్ ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు.
పాన్ కార్డు ఉన్నవారికి ప్యాన్ కార్డును ఉచితంగా క్యూఆర్ కోడ్‌తో అప్‌గ్రేడ్ చేసే ప్యాన్ (పిఎఎన్)2.0 ప్రాజెకు వల్ల టాక్స్‌పేయర్ రిజిస్ట్రేషన్ సర్వీస్ సాంకేతిక ప్రక్రియతో వేగంగా నాణ్యంగా వినియోగదారులకు అందుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల వాస్తవమైన, డేటాతో కూడిన , పర్యావరణ హితమైన విధానాలతో , తక్కువ ఖర్చుతో , భద్రతతో , తగిన సౌకర్యాలతో సేవలు లభిస్తాయని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా డిజిటల్ సౌకర్యంతో డిజిటల్ ఇండియా విజన్‌తో ప్రభుత్వ సంస్థల ద్వారా ప్యాన్ వినియోగదారులకు అందుబాటు లోకి వస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. సాంకేతికంగా డిజిటల్ ద్వారా టాక్స్‌పేయర్ రిజిస్ట్రేషన్ సమకూరడమే కాక, వాణిజ్యానికి ఇతోధికంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాన్/టిఎఎన్ 1.0 ఎకోసిస్టమ్ ను ఒక విధంగా ఇది అప్‌గ్రేడ్ చేయడమే. ప్రస్తుతం దాదాపు 78 కోట్ల ప్యాన్స్ జారీ కాగా, వీటిలో 98 శాతం వ్యక్తిగతమైనవి.