రేవంత్ పనులన్నీ అల్లుడు, అదానీ కోసమే సొంత అల్లుడి కోసం 3వేల ఎకరాల
భూసేకరణ లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటున్న ముఖ్యమంత్రికి
బుద్ధి చెప్పేందుకే మహాధర్నా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు.. 13 హామీల అమలు
ఏమైంది? మానుకోట రాళ్ల సంగతి మాకు మాత్రమే తెలుసు రానున్న రోజుల్లో
ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఉరికించి కొట్టుడు ఖాయం మానుకోట మహాధర్నాలో కెటిఆర్
మన తెలంగాణ/మహబూబాబాద్ : కొడంగల్ రైతుల బాధలు వినే ఓపిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు.వికారాబాద్ జిల్లా, లగచర్లలో గిరిజనుల రైతులకు జరిగిన అన్యా యం గురించి తెలిపి, సిఎంకు బుద్ధి చెప్పడానికే మానుకోటలో మహాధర్నా కార్యక్రమం చేపట్టామని అన్నారు. సో మవారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన కెటిఆర్ మరిపెడ చేరుకున్నారు. అక్కడ నుంచి వందలాది కార్లు, ద్విచ క్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ మహబూబాబాద్ చేరుకున్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎంపి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభ ప్రాంగంణంలో కెటిఆర్ మాట్లాడు తూ.. ఫార్మాసిటీ పేరుతో లగచర్లలో అమాయక రైతుల భూములు మూడు వేల ఎకరాలను లాక్కుని తన ఆంధ్ర అ ల్లుడికి కట్టబెట్టాలని సిఎం చూస్తున్నారని ఆరోపించారు.
అల్లుడు, ఆదానీల కోసమే రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని దు య్యబట్టారు. గత తొమ్మిది నెలలుగా వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్లలో ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి భూసేకరణ పనులు జరుగుతున్నాయని, తమకు జరుగబోయే అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్‌టి, ఎస్‌సి, బిసి రైతులు తిరగబడ్డారని పేర్కొన్నారు. ఇంత జరగుతుంటే రేవంత్‌రెడ్డి రైతులుతో చర్చలు జరపాల్సిందిపోయి, ఢిల్లీ పోవడం రావడం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైందని, ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ చేస్తుంటే చిన్న, సన్నకారు రైతులు తిరగబడ్డారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తే రైతులు చట్టాలను రద్దు చేసే వరకు పట్ట్టుబట్టిన విషయం విధితమేనని, ఇక్కడ కూడా రైతుల జోలికి వస్తే అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.
మానుకోటలో ౩౦ మంది గిరిజనులను జైల్లో వేస్తే వారిని పట్టించుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనను ఢిల్లీలో వివరించేందుకు వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన జ్యోతి అనే 9 నెలల గర్భిణి వచ్చి హ్యూమన్‌రైట్, ఎస్‌టి, ఎస్‌పి కమిషన్‌లకు ఫిర్యాదు చేసిందన్నారు. ఎంతటి దారుణం ఉంటే నిండు గర్భిణి వచ్చి ఫిర్యాదు చేసిందో అర్థం చేసుకోవాలన్నారు. లగచర్లలోని బక్కచిక్కిన రైతులకు బిఆర్‌ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు, పదమూడు హామీలను అమలు చేస్తామని అతీగతీ లేదన్నారు. మానుకోట సాక్షిగా చెబుతున్నానని..మానుకోట రాళ్ల సంగతి తమ పార్టీ వాళ్లకే తెలుసన్నారు. రాళ్ల వాడకంతోనే దేశ వ్యాప్తంగా మానుకోటకు పేరు వచ్చిందని గుర్తు చేశారు. రైతు బంధు, బీమా, ఉచిత కరంట్ వస్తున్నాయా.? అని ప్రజలను కెటిఆర్ అడిగారు. రావని చెప్పిన వారితో కెసిఆర్ ఉన్నప్పుడు వచ్చాయా..? అని అడిగితే వచ్చాయని ప్రజలు బదులిచ్చారు. లగచర్ల గిరిజనుల భూముల సర్వేకు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్‌లు వెళ్తే దాడి చేశారు.
కానీ రేవంతర్‌రెడ్డి వెళ్తే ఉరికిచ్చి కొట్టేవాళ్లన్నారు. రాష్ట్రంలో ఎక్కడ గిరిజనులకు అన్యాయం జరిగినా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ‘రేవంత్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిండు…అక్కడ కాంగ్రెస్ ఓడింది’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సిలు సిరికొండ మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంఎల్‌ఎలు ధరంసోత్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హరిప్రియ, గండ్ర వెంకటరమణరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, భూపాల్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, చల్లా దర్మారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు కోటిరెడ్డి, బడే నాగజ్యోతి, మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ మార్నేని వెంకన్న మాజీ వైస్ ఛైర్మన్ ఫరీద్, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఆంగోతు బిందు, పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.