Tuesday, November 26, 2024

ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద సోషల్ మీడియా
పోస్టింగుల కేసులో ఎపి
పోలీసుల గాలింపు
జూబ్లీహిల్స్‌లోని ఆయన
నివాసంలో సోదాలు
కొయంబత్తూరు, ముంబయికి
ప్రత్యేక పోలీస్ బృందాలు

మన తెలంగాణ/సిటీ బ్యూరో : వివాదాస్పద సిని మా దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం ఎపి పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టింగుల కేసులో ఎపి పోలీసుల విచారణకు డుమ్మా కొట్టడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సోమవారం ఒంగోలు రూరల్ పోలీసులు వచ్చారు. అక్కడ రాంగోపాల్ వర్మ లేకపోవడంతో సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ’వ్యూహం’ సినిమా ప్ర మోషన్ సమయం లో టిడిపి నాయకుడు చంద్రబా బు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ క ల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్య మం వేదికగా రాంగోపా ల్ వర్మ పోస్టులు పెట్టారని ఎపిలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భా గం గా గతంలో ఒంగోలు పోలీసులు గతంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.

ఈ కేసు విచారణలో భాగంగా రాంగోపాల్ వర్మ సోమవారం ఒంగోలు పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. దీనికి తాను హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనికి నిరాకరించిన పోలీసులు రాంగోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిం ది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనకు 4 రోజుల సమయం కావాలంటూ అదేరోజు వాట్సాప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. దీంతో పోలీసులు 25న ఉదయం విచారణకు హాజరుకావాలంటూ మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపారు. దీనికి వర్మ స్పందించకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. అక్కడ లేకపోవడంతో ఓ సినీ హీరోకు సంబంధించిన ఫాం హౌస్‌లో ఉన్నట్లు తెలియడంతో శంషాబాద్, షాద్‌నగర్‌లో తనిఖీలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News