ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్
పెర్త్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ డబ్లూటిసి పాయింట్ల పట్టికలో తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురి కావడంతో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. అయితే ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధించడంతో మళ్లీ టాప్‌కు దూసుకెళ్లింది.
ప్రస్తుతం 61.11 శాతంతో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. డబ్లూటిసిలో ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడిన 9 మ్యాచుల్లో విజయం సాధించి ఐదింటిలో పరాజయం చవిచూసింది. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా 57.69 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడి 8 విజయాలను సొంతం చేసుకుంది. మరో ఐదింటిలో ఓటమి పాలైంది. శ్రీలంక (55.56), న్యూజిలాండ్ (54.55), దక్షిణాఫ్రికా (54.17) టాప్5లో కొనసాగుతున్నాయి.