Tuesday, November 26, 2024

కెఏ. పాల్ పిల్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవిఎంల) స్థానే తిరిగి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌ను తీసుకురావాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కెఏ. పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. ” మీరు గెలిస్తే ఈవిఎంలు మంచివి, ఈవిఎంలు ట్యాంపర్ కాలేదని అంటారు. ఓడిపోతే మాత్రం ఈవిఎంల ట్యాపరింగ్ జరిగిందని అంటారు” అని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పిబి. వరలేతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను నిలదీసింది.

బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచినట్టు తేలిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని, ఎన్నికల అవకతవకలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానం రూపొందించాలని కెఏ పాల్ కోర్టుకు తాన వాదన వినిపించారు. పలు విదేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని అనుసరస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో దేశంలో వేల కోట్ల అవినీతి కూడా జరుగుతోందన్నారు.

దీనిపై ధర్మాసనం తిరిగి కేఏ పాల్‌ను నిలదీసింది. మిగతా ప్రపంచంలో బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్నంత మాత్రాన మీరెందుకు భిన్నంగా ఉండాలని కోరుకోవడం లేదు? బ్యాలెట్ విధానాన్ని అనుసరించినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందని అనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం లెవనెత్తుతున్న సమస్యలకు బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ సమర్ధవంతమైన, ఆచరణకు యోగ్యమైన పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News