Wednesday, November 27, 2024

రామ్‌గోపాల్‌ వర్మకు మరో షాక్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఎపి హైకోర్టులో చుక్కెదురైంది. రామ్‌గోపాల్‌వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. దీంతో నవంబర్ 27న రామ్‌గోపాల్‌వర్మ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఆర్జీవీ ఆచూకీ కోసం రెండు బృందాలుగా ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దీంతో ఆయన ఎక్కడ? తెలుగు స్టేట్స్‌లోనే ఉన్నారా?. అసలు ఎక్కడున్నారు?. ఇది కనిపెట్టే పనిలో ఎపి పోలీసులు ఉన్నారు. ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న దానిపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో వేర్వేరుగా రామ్‌గోపాల్‌వర్మపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన సంగతి విదితమే. ఒంగోలులో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. దీంతో ఎపి పోలీసులు ఆయనను వెతికే పనిలో పడ్డారు. రామ్‌గోపాల్ వర్మ తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారానికి వాయిదా వేసింది.

అజ్ఞాతంలోకి రామ్‌గోపాల్ వర్మ.. పోలీసులు విస్తృత గాలింపు
రామ్‌గోపాల్‌వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో వేట సాగిస్తున్నారు. ఒంగోలు విచారణకు డుమ్మా కొట్టిన ఆయన ఈనెల 23న కోయంబత్తూరులో షూటింగ్‌లో పాల్గొన్నట్టు ఫొటోలు, నటులతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో వర్మ పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రామ్‌గోపాల్‌వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్, తమిళనాడు పోలీసులతో ఎస్‌పి దామోదర్ సంప్రదింపులు జరిపారు. ఇంత గందరగోళంగా ఉంటే రామ్‌గోపాల్‌వర్మ మాత్రం అజ్ఞాతం వీడటం లేదు. ఆయన ఆచూకీ కోసం గత 2 రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని రామ్‌గోపాల్ వర్మ నివాసం, శంషాబాద్‌లోని ఫామ్ హౌస్‌లోనూ ఎపి పోలీసులు తనిఖీలు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ రామ్‌గోపాల్ వర్మ కోసం ఎపి పోలీసులు జల్లెడ పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News