Thursday, December 26, 2024

విడుదలకు సిద్ధమైన ‘తల్లి మనసు’

- Advertisement -
- Advertisement -

రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధా న పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘తల్లి మనసు‘. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ముత్యాల మూవీ మేకర్స్ ప తాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. ఇటీవలనే తొ లికాపీ సిద్దమైన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేశారు. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News