Wednesday, November 27, 2024

బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలి: కేంద్రాన్ని కోరిన ఇస్కాన్

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: బంగ్లాదేశ్‌లో తమ సంస్థకు చెందిన ప్రతినిధులపైన, ఇతర సభ్యులపైన జరుగుతున్న దాడులపై కేంద్రాన్ని అప్రమత్తం చేశామని కోల్‌కతాకు చెందిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్) బుధవారం తెలిపింది. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు ఈఅక్కడ జరుగుతున్న దాడులలో తాజా ఉదాహరణగా ఇస్కాన్ కోల్‌కత అధికార ప్రతినిధి రాధారమణ దాస్ తెలిపారు. ఇస్కాన్ పూజారులు, భక్తులతోపాటు మైనారి హిందూ మతానికి చెందిన సభ్యులపైన కూడా బంగ్లాదేశ్‌లో దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇస్కాన్‌తోపాటు, రామకృష్ణ మిషన్ వంటి ఇతర హిందూ సంస్థలకు చెందిన ప్రతినిధులపైన బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్టుల నుంచి వేధింపులు పెరిగిపోతున్నాయని, ఇప్పుడు చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు తాజా ఉదాహరణగా నిలిచిందని ఆయన చెప్పారు.

అటువంటి దాడుల నుంచి హిందువుల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశఋ వ్యవహారాల శాఖను, హోం శాఖను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ దాడులను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరవలసిందిగా కేంద్రాన్ని అర్థించినట్లు ఆయన వివరించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిని ఐక్య రాజ్య సమితి పరిగణనలోకి తీసుకుని చిన్మయ్ కృష్ణ దాస్ తక్షణ విడుదలకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ ఆందోళన
బంగ్లాదేశ్‌లో మైనారిటీ మతస్తులైన హిందువులు ఎదుర్కొంటున్న అభద్రత పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు పట్ల కాంగ్రెస్ అందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీల ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించడానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరా బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News