Thursday, November 28, 2024

బ్యాలట్ పేపర్లు తెచ్చేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయం:కన్వాసీ లఖ్మా

- Advertisement -
- Advertisement -

బ్యాలట్ పేపర్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేంత వరకు రానున్న ఏ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పోటీ చేయదని ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి కన్వాసీ లఖ్మా బుధవారం వెల్లడించారు. బ్యాలట్ పేపర్ ఓటింగ్‌ను తీసుకురావాలన్న ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండుపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. బ్యాటల్ పేపర్లను ప్రవేశపెట్టేంత వరకు రానున్న ఎన్నికలు వేటిలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోదని విలేకరులతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.

ఇండియాలోని భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ చర్చలు జరిపి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం ఖర్గే ఇవిఎంలను విమర్శిస్తూ ఎన్నికలలో బ్యాలట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండు చేశారు. కాగా..దేశంలో బ్యాలట్ పేపర్ ఓటింగ్‌ను తీసుకురావాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేస్తూ ఎన్నికలలో ఓటమి పాలైనపుడే అభ్యర్థులు ఇవిఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడతారంటూ వ్యాఖ్యానించడం గమనార్హ ం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News