కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. గురువారం ఆమె లోక్ సభలో ఎంపీగా ప్రమాణం స్వీకారం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన అనంతరం స్పీకర్ ఓం బిర్లా.. ప్రియాంక గాంధీ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చీరకట్టులో వచ్చారు. ప్రియాంక వెంట రాహుల్ గాంధీ.. పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఎంపిగా ప్రమాణం చేసిన అనంతరం ఆమెకు పలువురు ఎంపీలు అభినందనలు తెలిపారు.
కాగా నవంబర్ 20న జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన ప్రియాంక.. నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో రికార్డు విజయం సాధించింది. ఈ క్రమంలో ఆమె రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలీతోపాటు వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, వయనాడ్ స్థానాకి రాజీనామా చేయడంతో ఉపన్నిక జరిగింది.