Friday, November 29, 2024

యుపిలో స్టాఫ్ నర్సుపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఒక మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడడంతోపాటు ఆమె మర్మాంగంలోకి కర్రను చొప్పించి కారం పొడి చల్లిన అమానుష ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని జాలౌన్‌లో గురువారం ఉదయం సంభవించింది. అయితే పోలీసులు మాత్రం ఆ మహిళకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడంతో గాయపడిందని తెలిపారు. ఆమె చేసిన తీవ్ర ఆరోపణలను పురస్కరించుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలి భర్త కథనం ప్రకారం నర్సుగా పనిచేస్తున్న తన భార్య గురువారం ఉదయం 9 గంటలకు స్కూటర్‌పై ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిందని,

కాని కొద్దిసేపటికే ఫోన్ చేసి రోడ్డుపైన అడ్డగించిన కొందరు వ్యక్తులు తనను పక్కనున్న పొదలలోకి లాక్కుని వెళ్లి కొట్టారని చెప్పిందని, నలుగురు వ్యక్తులు గట్టిగా పట్టుకోగా ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె చెప్పిందని ఆయన తెలిపారు. తన భార్య మర్మాంగంలోకి కర్రను చొప్పించి కారం పొడి చల్లారని కూడా ఆయన తెలిపారు. పోలీసులు తన భార్యను వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని ఆయన తెలిపారు. ఒక మహిళను కొందరు వ్యక్తులు కొట్టినట్లు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారని, చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించామని అదనపు ఎస్‌పి ప్రదీప్ కుమార్ వర్మ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News