Sunday, January 5, 2025

పార్లమెంట్ లో అదానీ రగడ.. తగ్గేదే లే అంటున్న ప్రతిపక్షాలు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అంశంపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దీంతో శుక్రవారం ఉదయం ఉభయ సభల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేటికే వాయిదా పడ్డాయి. అమెరికాలో అవినీతి కేసు అభియోగాల నేపథ్యంలో సభలో అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లే అన్నట్లుగా విపక్ష ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు అట్టడుకుతున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభల్లో గందరగోళం నెలకొంది. నిరసన, ఆందోళనల నడుమే కొద్దిసేపు సాగిన అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఇక, రాజ్య సభలోనూ ఇదే పరిస్థితులు ఉండటంతో సోమవారానికి వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News