- Advertisement -
మాస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తెలివైన రాజకీయ నేత అని ప్రశంసించారు. కజకిస్థాన్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రష్యా నేత మీడియాతో మాట్లాడారు. ‘‘అమెరికా చరిత్రలోనే ఈ సారి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయనపై పోరాడేందుకు అనాగరిక పద్ధతులు పాటించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యం చేసుకుని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. ఆయనపై ఒకటికంటే ఎక్కువసార్లు హత్యాయత్నం చేశారు’’ అన్నారు. ఇదిలావుండగా రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు బైడెన్ ప్రభుత్వం దీర్ఘ శ్రేణి క్షిపణులను ఇవ్వడాన్ని రష్యా తీవ్రంగా ఖండించింది.
- Advertisement -