Sunday, January 5, 2025

మైదానంలో కుప్పకూలిన క్రికెటర్

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని పూణెలో క్రికెట్ మైదానంలో గుండెపోటుతో క్రికెటర్ మృతి చెందాడు. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని గర్వార్ క్రికెట్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్, యంగ్ 11కు మధ్య మ్యాచ్ జరుగుతుండగా గుండెనొప్పి వస్తుందని ఎంపైర్‌కు ఇమ్రాన్ సికిందర్ పటేల్ చెప్పాడు. వెంటనే మైదానం నుంచి వెళ్తుండగా పటేల్ కుప్పకూలడంతో ఆటగాళ్లు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే క్రికెటర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు.  సికిందర్ పటేల్ లక్కీ బిల్డర్స్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు. దీంతో పటేల్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News