- Advertisement -
రాంఛీ: తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా ప్రధానోపాధ్యాయురాలిపై ఉపాధ్యాయుడు గన్‌తో కాల్చిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం ఢియోగఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చితర్ పోకా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చాందినీ కుమారీ హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే పాఠశాలలో శైలేష్ యాద్ అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నారు. చాందినీ కుమార్ తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా ఆమెపై శైలేష్ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చేతుల బుల్లెట్లు దిగినట్టు వైద్యులు వెల్లడించారు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -