Friday, November 29, 2024

చంద్రబాబు నాయుడు బెయిల్ వినతిపై విచారణ వాయిదా!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ మంజూరుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను శుక్రవారం సుప్రీంకోర్టు జనవరి 2025కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాయిదా వేయాలని కోరడంతో న్యాయమూర్తులు బేల ఎం త్రివేది , ఎస్‌సి శర్మతో కూడిన ధర్మాసనం కేసును వాయిదా వేసింది.

‘‘పదేపదే వాయిదా వేయడంలో పాయింట్ అన్నదే లేదు. చివరి అవకాశంగా జనవరి రెండో వారానికి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు నాయుడు చాలా ప్రభావశాలి వ్యక్తి అని, ఆయన ఇద్దరు కీలక సహచరులు దేశం వదిలిపెట్టి వెళ్లిపోయారని, కనుక ఆయన బెయిల్ ను పక్కన పెట్టాలని కోరడం జరిగింది. నిందితుడు దర్యాప్తుకు అడ్డంకులు కల్పిస్తున్నారని, కనుక ఆయనకు బెయిల్ ఇవ్వరాదని వినతిలో కోరడం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News