‘‘ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామని అప్‌డేట్ కావటం మానుకోలేం’’ అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది.ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్‌లో తన వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి తెలిపారు.
ఈ సందర్భంగా గాయత్రి దేవి మాట్లాడుతూ.. సర్వం శక్తి మయం సిరీస్‌కు పని చేయటం నాకు వికటకవి సిరీస్‌కు వర్క్ చేయటానికి ఎంతగానో హెల్ప్ అయ్యిందని, నిజానికి సర్వం శక్తిమయం సిరీస్ తర్వాత పీపుల్ మీడియా బ్యానర్ సంస్థ నిర్మించిన సిరీస్ హరికథకు వర్క్ చేశానని గాయత్రి దేవి అన్నారు. అది కూడా పీరియాడిక్ సిరీస్ 90వ దశకం కథ,కథనంతో రూపొందిందని, డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని, త్రీరోజెస్ ఫేమ్ మ్యాగీ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారన్నారు. దీంతో పాటు వికటకవి సిరీస్‌కు వర్క్ చేసే అవకాశం ఒకేసారి వచ్చిందని, పీరియాడిక్ సిరీస్‌ల్లో హరికథ ముందుగా స్టార్ట్ అయ్యిందని, ఒక సిరీస్ షూట్ ఉన్నప్పుడు మరో సిరీస్ షూట్ లేకుండా ఉండటం కూడా కాస్త కలిసొచ్చిందని ఆమె అన్నారు. అలాగే హరికథ చేసిన వర్క్ వికటకవి విషయంలో హెల్ప్ అయ్యిందన్నారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సిరీస్‌లకు వర్క్ చేయటం అనేది రెగ్యులర్‌గా సాధ్యంకాదని, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలంతే అని ఆమె అన్నారు.