Saturday, November 30, 2024

సుకుమార్ నన్ను స్టార్‌ను చేశాడు : అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన పుష్ప-2 ది రూల్ చి త్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆ యన క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ముంబయ్‌లో ’పుష్ప-2’ హీరో, హీరోయిన్ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేస్తున్న అనిల్ తడాని, భరత్ భూషణ్‌లకు థ్యాంక్స్. నా చిన్ననాటి స్నేహితుడు నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.

త్వరలోనే పుష్ప-2 నుంచి మరో సూపర్ సాంగ్ రాబోతుంది. ఈ పాటతో దేవి మ్యాజిక్ మరో సారి తెలుస్తుంది. అందరి హృదయాలను హత్తుకునే పాట అది. ఫహాద్ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్ గా వుంది. శ్రీలీల, రష్మికలతో పనిచేయడం ఎంతో హ్యపీ. నన్ను స్టార్‌ను చేసింది జీనియస్ దర్శకుడు సుకుమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ప్రపంచంలో ప్రతి ఇండియన్, ప్రతి భాష వాళ్లు, ప్రతి రాష్ట్రంలోని వాళ్లు అంద రూ కలిసి పుష్ప-2 విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది”అని అన్నారు. రష్మిక మందన్నా మాట్లాడుతూ ”ఐదు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్ వున్నాయి. పుష్ప దిరైజ్‌లో నా పై చిత్రీకరించిన తొలి సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. డిసెంబర్ 5న మా చిత్రం వస్తుందని గర్వంగా చెబుతున్నాను. సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడుతో పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది”అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ “ఈ చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు”అని తెలియజేశారు. అల్లు అర్జున్ స్వాగ్‌తో ఈ సినిమా వైల్డ్ ఫైర్‌గా మారిందని ఏఏ ఫిలింస్ అధినేత అనిల్ తడాని తెలిపారు. ఈ సమావేశంలో టీసీరిస్ అధినేత భూషణ్ కుమా ర్, ఎగ్జిబిటర్ శృతి అమ ర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News