Tuesday, January 7, 2025

టిజిపిఎస్సి కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియామకం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్సి)కు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను టిజిపిఎస్సి ఛైర్మన్ గా నియమించింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, డిసెంబర్ 3తో ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది.

ఈ క్రమంలో ఛైర్మన్ పోస్టుకు నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లతోపాటు మొత్తం 45 ద‌ర‌ఖాస్తులు రాగా.. అందులో బుర్రా వెంకటేశంను సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేసి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన నియామక ఫైల్‌ను గవర్నర్‌కు పంపగా ఆమోదించడంతో టిజిపిఎస్సి కొత్త ఛైర్మన్ గా నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News