Sunday, January 5, 2025

యువతిని నగ్నంగా కౌగలించుకున్న హీరో… కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ముంబయి: డిజిటల్ కంటెంట్ ఇచ్చే యువతితో బాలీవుడ్ హీరో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం ఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 32 ఏళ్ల యువతి డిజిటల్ కంటెంట్ ఇస్తూ జీవనం సాగిస్తుంది. బాలీవుడ్ హీరో ఆమెకు ఫోన్ చేసి డిజిటల్ కంటెంట్ కావాలని అడిగాడు. తాను చెప్పిన లోకేష్‌ను కు రావాలని ఆమెకు కబురు పంపాడు. లోకేష్‌నకు ఆమె వెళ్లగా ఆపార్ట్‌మెంట్ లోని తన ప్లాట్ కు రావాలని సూచించాడు. ఆపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ లో కి వెళ్లింది. అప్పటికే అతడు బెడ్‌రూమ్‌లో నగ్నంగా కనిపించడంతో యువతి భయంతో వణికిపోయింది. వెంటనే అతడు ఆమెను గట్టిగ కౌగలించుకోవడంతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అతడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లిపోయింది. నగ్నంగా ఉన్న వీడియోను ఆమెకు వాట్సప్‌కు పంపించాడు. దీంతో ఆమె ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోకు ఫోన్ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. మా కుటుంబ సభ్యులలో ఒకరిది వర్ధింతి ఉండడంతో న్యూయార్క్ నుంచి కోల్‌కతా వచ్చాక తరువాత కలుస్తానని హీరో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News