Friday, December 27, 2024

భారీగా పెరిగిన సబ్బులు, కాఫీ, టీపొడి ధరలు

- Advertisement -
- Advertisement -

అనూహ్యంగా దేశంలో సబ్బులు, కాఫీ, టీ పొడి ధరలు పెరిగిపోయాయి. స్నానపు సబ్బుల ధరలను హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రెజ్, విప్రో సహా అన్ని ఎఫ్‌ఎంసిజి సంస్థలు పెంచేశాయి. వాటి ధరలు ఏడు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు పెరిగాయి. సబ్బుల ధరలో ప్రధాన ముడిపదార్థమైన పామాయిల్ ధర 35 నుంఇ 40 శాతం వరకు పెరగడంతో సబ్బుల ధరలను సంస్థలు పెంచేశాయి. ఇటీవలే కాఫీ, టీ పొడి ధరలను కూడా ఎఫ్‌ఎంసిజి సంస్థలు 25 శాతం వరకు పెంచేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో అవి ధరలను పెంచాయి. కొన్ని సంస్థలు ఒక్కసారిగా ఎనిమిది శాతం వరకు ధరలు పెంచితే, మరికొన్ని సంస్థలు దశలవారీగా పెంచుతున్నాయి. ఒక్కసారిగా ధరలు పెంచితే డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందనే ఆలోచనతో అవి దశల వారీగా ధరలు పెంచాలని నిర్ణయించాయి. చర్మ సంరక్షణ క్రీమ్‌ల ధరలను కూడా సంస్థలు పెంచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News