Thursday, December 26, 2024

సవతి కూతురుపై అత్యాచారం..దోషికి 141 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

కేరళ లోని మలప్పురం జిల్లాలో సవతి తండ్రి తన సవతి కుమార్తెపై కొన్నేళ్లుగా లైంగిక దాడికి పాల్పడడంతో విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు 7.85 లక్షల జరిమానా విధించింది. కేసు వివరాల ప్రకారం బాధితురాలి కుటుంబం తమిళనాడు నుంచి పనికోసం కేరళకు వచ్చింది. అప్పటి నుంచి 20172020 మధ్య కాలంలో సవతి తండ్రి తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడే వాడు. ఈ దురాగతాన్ని బాధితురాలైన బాలిక మొదట తన స్నేహితురాలికి చెప్పగా, తరువాత తల్లికి తెలిసి పోలీస్‌లకు 2021లో ఫిర్యాదు చేశారు. పోలీస్‌లు దర్యాప్తు చేసి నిందితునిపై పోక్సో చట్టంతోపాటు,

ఐపీఎస్, జువెనైల్ జస్టిస్ చట్టాల్లోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2022లో బెయిలుపై విడుదలైన తరువాత కూడా నిందితుడు సవతికుమార్తెపై లైంగిక దాడికి మళ్లీ పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై మరో కేసు నమోదైంది. మరోవైపు మంజేరి ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ రెండు కేసులపై విచారణ జరిపింది. నవంబర్ 29న జడ్జి అష్రఫ్ ఏఎం తీర్పు ఇచ్చారు. పోక్సో , జువెనైల్ జస్టిస్ చట్టాలతోపాటు ఐపీసీ లోని పలు సెక్షన్ల ప్రకారం రెండు కేసుల్లో మొత్తం 141 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని కోర్టు పేర్కొంది. దీంతో ఆ దోషికి గరిష్ఠంగా 40 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News