Sunday, December 1, 2024

ఎన్టీఆర్ కు జోడీగా అందాల రాశి..

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు ఫిలిమ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని న్యూ టాలెంట్ రోర్స్ @బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ద్వారా ప్రతిభావంతులైన కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు.

శనివారం వీణారావు ఫస్ట్ దర్శన్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్ లాంచ్ చేశారు. అచ్చ తెలుగు అందాలరాశి వీణారావు ఫస్ట్ దర్శన్ అందరినీ మైమరపిస్తోంది. ఫస్ట్ దర్శన్ షో రీల్‌లో సంప్రదాయక, మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో వీణారావు డిఫరెంట్ బ్యూటీఫుల్ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన షో రీల్ గ్లింప్స్ అందరినీ అలరించింది. “కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకుల్ని రంజింప చేయడంలో తన వంతు నిరంతర కృషి చేస్తానని, తన అభిమాన నటి డాక్టర్ పి.భానుమతి రామకృష్ణ సాక్షిగా ప్రమాణం చేశారు వీణారావు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి వద్ద గత 18 నెలల అన్ని విభాగాల్లో శిక్షణ పొందానని… సినిమా, నటన పట్ల తన అంకితభావాన్ని ఆమె తెలియజేశారు.

వీణారావు ఫస్ట్ దర్శన్ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ “వీణా మన తెలుగమ్మాయి. మంచి కూచిపూడి డ్యాన్సర్. అందాల రాశి. తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ “వీణా మా విజయవాడ అమ్మాయి. చాలా అందంగా కనిపిస్తుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రావాల్సిన సమయం ఇది”అని తెలిపారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ “వీణారావు ఎంతో అదృష్టవంతురాలు. ఇలాంటి లాంచ్ దొరకడం మామూలు విషయం కాదు. వీణా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత యలమంచిలి గీత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News