- Advertisement -
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్టుమెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక, శుక్రవారం శ్రీవారిని 73,619 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. 23,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు, తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నాయి. దీంతో పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేశారు. వర్షం కారణంగా గోగర్భం జలాశయం నిండిపోయింది. ఈ క్రమంలో 3 సెం.మీ. మేర గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు.
- Advertisement -