Tuesday, January 7, 2025

నేను ఎక్కడికి పారిపోలే.. హైదరాబాద్‌లోనే డెన్‌లో ఉన్నా

- Advertisement -
- Advertisement -

పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చా
నా సమాధానంపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తా
అరెస్ట్ చేస్తారన్న సమాచారంతోనే
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశా
మరోసారి రామ్‌గోపాల్ వర్మ స్పందన

మన తెలంగాణ/హైదరాబాద్: ఏపీలో వివిధ చోట్ల తనపై నమోదైన కేసులపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. ఆదివారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ తనపై ఐదు కేసులు పెట్టడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. తన ట్వీట్ల వెనక రాజకీయ దురుద్దేశం లేదని, కేవలం ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకే ట్వీట్లు పెట్టానన్నారు. తాను పోలీసులకు భయపడి ఎక్కడికి పారిపోలేదని, హైదరాబా ద్‌లోని డెన్‌లోనే ఉన్నానన్న రామ్‌గోపాల్‌వర్మ, అరెస్ట్ చేస్తారన్న సమాచారంతోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశానని వెల్లడించారు.

పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని, తన సమాధానంపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న అభియోగాలపై రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. టిడిపి నేతల ఫిర్యాదు మేరకు వివిధ స్టేషన్లలో రామ్‌గోపాల్‌వర్మపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.

ఇందులో భాగంగానే విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు రామ్‌గోపాల్ వర్మకి రెండు సార్లు నోటీసులు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పోలీసుల విచారణకు రెండుసార్లు రామ్‌గోపాల్‌వర్మ డుమ్మా కొట్టారు. దీంతో రామ్‌గోపాల్‌వర్మను అదుపులోకి తీసుకునేందుకు ఎపి పోలీసులు నేరుగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. ఆ సమయంలో రామ్‌గోపాల్ వర్మ ఇంట్లో లేకపోకపోవడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూసి చేసేదేమి లేక పోలీసులు వెనుదిరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News