రూ. 1000 కోట్ల వ్యయంతో కోకో కోలా గ్రీన్ ఫీల్ ప్లాంట్
ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : రూ. 1000 కోట్ల వ్యయంతో నిర్మించిన కోకో కోలా గ్రీన్ ఫీల్ ప్లాంటును సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ సిద్ధిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్ ను సోమవారం మధ్నాహ్నం 12 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.