Monday, December 2, 2024

ప్రతి మహిళ కనీసం ముగ్గురిని కనాలి

- Advertisement -
- Advertisement -

దేశంలో జనాభా తగ్గుదల
ఆందోళనకరం
సంతానోత్పత్తి రేటు 2.1
కన్నా తగ్గితే ఆ సమాజం
అదృశ్యమవుతుంది
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్
భగవత్ కీలక వ్యాఖ్యలు

నాగపూర్: “మన దేశంలో జనాభా తగ్గుతుండటం ఆందోళన చెందాల్సిన అంశం. జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రే టు 2.1 మించి దిగువకు వెళ్తే సమాజం న శించే ప్రమాదం ఉంది. అందుకనే ప్రతిమహిళ తన జీవిత కాలంలో ప్రస్తుత రేటు 2.1 కన్నా కనీసం ముగ్గురు పిల్లలకైనా జన్మను ఇవ్వవలసి ఉంటుంది ” అని ఆర్‌ఎస్‌ఎస్ చీ ఫ్ మోహన్ భాగవత్ సూచించారు. దేశంలో రానురాను జనాభా తగ్గుతుండటంపై ఆయ న ఆందోళన వ్యక్తం చేశారు. నాగపూర్‌లో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన ‘ కథ లే కుల్ సమ్మేళన్ ” కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడారు. కుటుంబాల వైశి ష్టం గురించి వివరిస్తూ సమాజంలో సం తానోత్పత్తి రేటు 2.1 శాతం కంటే తక్కువ గా ఉంటే ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే  అదృశ్యమవుతుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందని పేర్కొన్నారు.

జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతం కంటే సంతానోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు. సమాజం మనుగడ సాధించాలంటే ఇద్దరు లేదా ముగ్గురి అవసరం ఉందని, ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందని, ఈ సంఖ్య చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 2021లో విడుదలైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం గర్భనిరోధక రేటు 54 శాతం నుంచి 67 శాతానికి పెరుగుతుండగా, పూర్తి సంతాన శాతం (టిఎఫ్‌ఆర్) రేటు 2.2 నుంచి 2 కు క్షీణించిందని వెల్లడైంది.

19602000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తరువాత నుంచి తగ్గుముఖ పడుతోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాతతరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు. 2.1 కన్నా తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా,బ్రెజిల్, మెక్సికోలు ఉండగా, చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో అంతకన్నా తక్కువ కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, దేశ సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 1950 లో ఫెర్టిలిటీ రేటు ఒక్కో మహిళకు 6.2 కంటే ఎక్కువగా ఉండేది. ఇటీవలి కాలంలో అది 2.1 శాతానికి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి దేశ సంతానోత్పత్తి రేటు కేవలం 1.3 కి పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎంపి అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్

సంతానం పెంచాలని మోహన్ భాగవత్ చేసిన సూచనలపై హైదరాబాద్ ఎంపీ ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పిల్లలను కంటారని ఇదివరకు ప్రధాని మోడీ ఆక్షేపించడాన్ని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ అధికారం లోకి వస్తే బంగారాన్ని , మంగళసూత్రాలను, తల్లుల దగ్గర నుంచి , కుమార్తెల నుంచి లాక్కుని, వాటిని తిరిగి ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని మోడీ చేసిన విమర్శలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News