- Advertisement -
తుపాకీతో కాల్చుకుని ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై హరీశ్.. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలతో ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -