Monday, December 2, 2024

మావోయిస్టులను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి చంపారు: పౌర హక్కుల సంఘం

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక వద్ద ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.  అయితే ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్ వేసింది. పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారని ఆరోపించింది.

మావోయిస్టులు తినే భోజనంలో మత్తు పదార్థాలు కలిపి కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత వారిని కస్టడీలో చిత్ర హింసలకు గురిచేశారని పేర్కొంది. చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృత దేహాలపై తీవ్ర గాయాలున్నాయని వెల్లడించారు. మృత దేహాలను కుటుంబ సభ్యులకు చూపకుండా నేరుగా పోస్టుమార్ట్ కు పంపారని ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇదిలావుండగా కాకతీయ మెడికల్ కాలేజ్ లో పోస్టు మార్టం నిర్వహించారని, పోస్టుమార్టం ప్రక్రయను వీడియో తీశారని  ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. కాగా తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News