బిజెపి మహారాష్ట్ర శాసనసభా పక్ష సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం నియమితులయ్యారు. బిజెపి ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నాయకుడిని ఈ సమావేశంలో ఎన్నుకోనుండగా నాయకడిగా ఎన్నికయ్యే వ్యక్తే ముఖ్యమంత్రి కానున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో డిసెంబర్ 5వ తేదీ సమాయంత్రం నూతన మహాయుతి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు
మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులే తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి బిజెపి ఎమ్మెల్యేలు సమావేశమవుతారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఎంపికపై బిజెపి నాయకత్వం ప్రకటన చేయనప్పటికీ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌కే కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పార్టీకి రెండు ప్రధాన మిత్రపక్షాలైన శఙశషస్త్రణ; ఎన్‌సిపి నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కొత్త ప్రభుత్వంలో ఉండే అవకాశం ఉంది.