Monday, December 2, 2024

ఇంకో పదేళ్లు అధికారంలో కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో సోమవారం ఎన్టీఆర్ మార్గ్ లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయ నియామకాలు, పాఠశాలల నిర్వహణ ఏజేన్సీలకు అప్పగింత, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంపు, రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంత్రి తర్వాత రైతు భరోసా విడుదల చేస్తామన్నారు. సన్న బియ్యం వడ్లు పండిస్తే రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. రానున్న 10 ఏళ్ల కాలంలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందన్నారు. ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పండించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన 213 అంబులెన్స్ బండ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News