Tuesday, December 3, 2024

ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది. ఆదివారం జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై సోమవారం విచారణ జరగ్గా పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్ట డీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని న్యాయస్థానానికి వివరించారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని, కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టంకు తరలించారన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరు ద్ధంగా పోలీసులు వ్యవహరించారని కోర్టుకు విన్నవించారు. అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మావోల మృతదేహాలను వెంటనే ములుగు ఆస్ప త్రికి తరలించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టు మార్టం నిర్వహించారని చెప్పారు.

ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసినట్లు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం మంగళ వారం వరకూ మృతదేహాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. మృతదేహాలను బంధువులు, కుటుంబ సభ్యులకు చూపించాలని ఆదే శిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్ల వారుజామున భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందా రు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల కమిటీ స్పందిస్తూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని, మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుందని లేఖలో వెల్లడించింది. మృతదేహాలకు నిపు ణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో 16 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చిందని హక్కుల సంఘం ఆరోపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కగార్‌ను రాష్ట్రంలో అమలుపరిచే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని హక్కుల కమిటీ లేఖలో వెల్లడించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News