బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్ లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటేభారత్‌కు బంగ్లాదేశ్‌కు తేడా ఏముందని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. దీనిపై జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా ఇదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని, రాజ్యాంగం హామీ ఇచ్చినట్టుగా మతం ఆధారంగా వివక్ష ఉండరాదని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం లోని మందిరాలు, మసీదుల విషయంలో ఇటీవల జరుగుతున్న వరుస వివాదాలపై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో సోమవారం మాట్లాడారు. ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని, దీనిని తక్షణం ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. 24 కోట్ల ముస్లింలను సముద్రం లోకి నెట్టేయలేరు. ప్రభుత్వం ముస్లింలను సమానంగా చూడాలి. మతం ఆధారంగా వివక్ష అనేది రాజ్యాంగంలో లేదు. కేంద్రం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తే ఇక ఇండియా అనేది ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.