మేషం- ఎంతో శ్రమించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగంలోని వారు తొందరపడకుండా నిదానంగా ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది.
వృషభం- చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విద్యా సాంస్కృతిక కార్యక్రమాల కొరకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథునం- నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. సంబంధం బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. వివాహ ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం – వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. రాజకీయాలు అమితంగా ఆకర్షిస్తాయి. సరికొత్త నిర్ణయాలను తీసుకుంటారు. అయితే వాటి అమలు విషయంలో ఊగిసలాట చోటు చేసుకుంటుంది.
సింహం – మీ పరపతి పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. పోటీ తత్వాన్ని పెంచుకుంటారు. కుటుంబ సమస్యలను నేర్పుగా చక్కదిద్దుకుంటారు.
కన్య- చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. స్థిరాస్తి విషయంలో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి.
తుల: అన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీ సలహాలను పాటించేవారు ఎక్కువగా ఉంటారు. విదేశీ సంబంధమైన విషయ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.
వృశ్చికం: శారీరక మానసిక శ్రమ అధికమవుతుంది. సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు.పెట్టుబడుల విషయంలో స్పష్టత ఏర్పడుతుంది.
ధనస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ప్రచారంలో ఉన్న నిందలను రూపుమాపు పోవడానికి శ్రీకారం చుడతారు.
మకరం: ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. నిర్మాణాత్మక వ్యవహారాలలో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి.
కుంభం: కుటుంబ బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు.
మీనం: పనులు సానుకూలపడతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కొంత ఆనందం కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన పెట్టుబడులలో తొందరపాటు వద్దు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225