Wednesday, December 4, 2024

అప్పులు దాటి.. అభివృద్ధి బాటలో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అప్పులను దాటి అభివృద్ధి బాటవైపు ప్రభుత్వం పయనిస్తోంది. అందులో భాగంగా ఆర్ధిక క్రమశిక్షణకు పెద్దపీ ట వేస్తోంది. తెచ్చిన అప్పులు రూ.52,118 కో ట్లు కాగా, వడ్డీలు, కిస్తుల చెల్లింపులకు రూ. 64,516 కోట్లను ప్ర భుత్వం చెల్లిస్తోంది. దీనికితోడు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.61, 194 కోట్లను వెచ్చిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం అధికారంలో కి వ చ్చినప్పటి నుంచి తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పులతో అతలాకుతలమై న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా క్ర మశిక్షణను పాటిస్తోంది. 2014 నుంచి 2023 వ రకు పదేండ్లలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం దా దాపు రూ.7లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలు గా మారాయి. వాటిని అధిగమించి ప్రజలకు ఇ చ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్ర భుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్ర ణాళిక ప్రణాళికేతర ఖర్చులకు స రిపడేలా సర్దుబాటు విధానం అ నుసరిస్తోంది.

లక్ష కోట్ల బి ల్లులను క్రమపద్ధతి లో చెల్లించేలా… గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు లక్ష కో ట్ల బిల్లులను క్ర మపద్ధతిలో చెల్లించే విధానాన్ని అనుసరిస్తోంది. 2023 డిసెంబర్ నుం చి 2024 నవంబర్ నెలాఖ రు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.52,118 కోట్లు అప్పు లు తీసుకుంది. ఇదే వ్యవధి లో రూ. 64,516 కో ట్లు రీ పేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు తి రిగి చెల్లింపులు) చేసింది. వీటికి తోడుగా ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకాలకు రూ. 61,194 కోట్లు ఖర్చు చేసింది. ఒకవైపు అప్పులను తీరుస్తూనే గ్యారంటీల అమలుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పథకానికి అవసరమైన నిధులను సమీకరించటంలో ఆర్థిక శాఖ కీలక పాత్రను నిర్వర్తించింది. ఏక కాలంలో రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేసి రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలోని 25.36 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి దాదాపు రూ.57 వేల కోట్లు ఖర్చు చేసింది. రుణమాఫీతో పాటు రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్న వడ్ల బోనస్‌కు భారీగా నిధులను ఖర్చు చేసింది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించింది.

54,520 ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ పూర్తి
అప్పులను తీరుస్తూనే మొదటి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీ అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి, గృహజ్యోతి తోపాటు యువ వికాసాన్ని అమలు చేసింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులకు ఉద్యోగాలపై భరోసాను కల్పించింది. తొలి ఏడాదిలోనే వార్షిక జాబ్ క్యాలండర్‌ను విడుదల చేసింది. 54,520 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక ప్రక్రియను పూర్తి చేసింది. వీటితో పాటు చేయూత, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, బియ్యం సబ్సిడీ, స్కాలర్‌షిప్‌లు, డైట్ ఛార్జీల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.61,194 కోట్లు ఖర్చు చేసింది. బిసి, మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నవంబర్ నాటికే దాదాపు రూ.9,888 కోట్లను ఖర్చు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News