- Advertisement -
విశాఖపట్నంలో విషాద సంఘటన జరిగింది. గాజువాక పరిధి షీలానగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ యువకుడు, యువతి రెండంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే సంఘనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -