Thursday, December 5, 2024

ఆస్పత్రులు రోగులను నిలువుదోపిడి చేస్తున్నాయి: మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు ఆస్పత్రులపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక కామెంట్స్ చేశారు. పేద ప్రజలను అడ్డగోలుగా దోచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యార్థి సమితి, యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ యూత్‌డే సదస్సులో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి.. సరైన శిక్షణ లేకపోవడం వల్ల యువత పెడదారి పడుతున్నారన్నారు.

గత ప్రభుత్వం విద్య, యువత విషయంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం కోసం జనం విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. కొన్ని ఆస్పత్రులు రోగులను నిలువుదోపిడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప గొప్ప ఆస్పత్రులు కట్టడం కాదని.. ఆస్పత్రులు అవసరం లేని పరిస్థితి తేవాలని మంత్రి జూపల్లి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News