Thursday, December 5, 2024

బడి ముందు ధర్నాకు దిగిన కంట్రాక్టర్లు

- Advertisement -
- Advertisement -

మెదక్: మన ఊరు మన బడి బిల్లులు రాలేదని స్కూల్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ బాలుర స్కూల్ వద్ద ఆందోళన చేపట్టడంతో పాటు గేటు తాళం చేసి ధర్నా నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికలోన్నత పాఠశాలలో రెండు సంవత్సరాల నుండి మన ఊరి మన బడి పధకం క్రింద పాఠశాల మరమ్మతులు పనుల కోసం సుమారు రూ. 85 లక్షలతో ఎలక్ట్రిషన్, ప్లంబర్ పనులు చేశామని పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ లతో పాటు కాంట్రాక్టర్ సాయిలు మీడియాకు తెలిపారు.

ఇప్పటికి రెండు సంవత్సరాలైనా బిల్లులు రావడం లేదని వాపోయారు. గతంలో ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్ కు పిర్యాదు కూడా చేశామని పేర్కొన్నారు. సుమారు రూ. 85 లక్షల బిల్లులురాక వడ్డీలు కడుతున్నామని ఆవేదన చెందారు. ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లినప్పటికి లాభం లేదన్నారు. ఈ ధర్నాలో స్కూల్ కమిటీ ఛైర్మన్లు సాయిలు, భూపాల్, శ్రీనివాస్, మాణిక్యం, లక్ష్మణ్ కృష్ణ , కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News