Thursday, December 5, 2024

నా కెరీర్ ఊహించని ఎన్నో అద్భుతాలు జరిగాయి: శ్రీను వైట్ల

- Advertisement -
- Advertisement -

“నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్‌లో జరిగాయి. దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నన్ను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు, మీడియాకి, ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అందరికీ కృతజ్ఞతలు”అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల. ’నీ కోసం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీనువైట్ల. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించింది. ఏడు నంది అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఇది బ్యూటీఫుల్ జర్నీ. నన్ను దర్శకుడిగా ఆదరించి, ఈ 25వ సంవత్సరంలో కూడా ’విశ్వం’ లాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు, మీడియాకి, నాకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాతలు, నటీనటులు అందరికీ ధన్యవాదాలు. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలనే కోరిక బలంగా వుంది.

ఇక కొన్ని కారణాల వలన ‘నీ కోసం’ సినిమా కొంతకాలం ఆగింది. రామోజీ రావు సినిమాని చూశారు. ఆయనకి చాలా నచ్చింది. ఆయన సినిమాని కొనేసి విడుదల చేశారు. అనంతరం రామోజీ రావు నాకు వారి బ్యానర్‌లో ’ఆనందం’ సినిమా ఇచ్చారు. నా జర్నీలో ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢీ… టాప్ 5 సినిమాలు. ఇక నా రాబోయే సినిమా ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటున్నారో ఆ వినోదం ఉంటూనే ఒక ఫ్రెష్ ఐడియాతో వుంటుంది. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వుంది. కథ 70 శాతం సిద్ధమైంది. త్వరలోనే ప్రాజెక్ట్ ని ప్రకటిస్తాం. ఇక వెంకీ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News