Thursday, December 5, 2024

5న ఇందిరమ్మ ఇండ్ల యాప్!

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ను డిసెంబర్ 5న ఆవిష్కరించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏ దళారికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం పేదోళ్లను మర్చిపోయి కేవలం పెద్ద వాళ్ల కోసం నిర్ణయాలు తీసుకుందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News