Wednesday, December 4, 2024

తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం, కుమ్మరిపల్లె గ్రామంలో తమ్ముడి చేతిలో అన్న హతమైన దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఉమాసాగర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బొమ్మెల సుమన్ (34) అదే గ్రామంలో కూలి పనిచేస్తూ జీవిస్తున్నాడు. తన తల్లి బొమ్మెల భారతమ్మ పేరున ఉన్న 32 గుంటల స్థలానికి రూ. 2.60 లక్షలు అమ్మకానికి బయానాగా తీసుకున్నాడు.

అయితే భూమి అమ్మిన డబ్బులలో తనకు వాటా ఉందని అతని తమ్ముడు బొమ్మెల డిల్లేష్ అన్నతో తగాదా పడ్డాడు. అయితే, వాటా ఇవ్వకపోవడంతో అన్నపై కక్ష పెంచుకున్న తమ్ముడు, తన స్నేహితుడు పోతనక సురేందర్ సహాయంతో అన్నను కత్తితో పొడిచి కిరాతంగా హతమార్చాడు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ధర్మపురి సిఐ రాంనర్సింహారెడ్డి, వెల్గటూర్ ఎస్‌ఐ ఉమాసాగర్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News