Wednesday, December 4, 2024

‘హరి హర వీర మల్లు’ షూటింగ్‌లో పవర్ స్టార్

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు. ఇటీవల రాజకీయంగా చాలా బిజీగా ఉన్న పవన్, ఇప్పుడు కొంత సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించాడు. అంతేకాకుండా షూటింగ్ సెట్స్ నుండి ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా పవన్ తిరిగి షూటింగ్ సెట్స్‌కి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడుగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ను రంగంలోకి దింపారు. అందాల నటి నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News