Thursday, December 5, 2024

పెద్దపల్లికి వరాల జల్లు

- Advertisement -
- Advertisement -

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువవికాసం వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భారీ వరాలు కురిపించారు. పెద్దపల్లి లో రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌తో పాటు ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలిగేడుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మంజూరు చేసింది. పెద్దపల్లిలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడేషన్.

రూ.51 కోట్ల అంచనాలతో పరిపాలనా ఆమోదం లభించింది. మంథనిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.22 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీ చేసింది. గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు పెద్దపల్లిలో ఫోర్ లేన్ బై పాస్ రోడ్డు, దాదాపు రూ.352 కోట్లతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రూ.10 కోట్ల అంచనాతో సబ్ స్టేషన్ల పనులు, రామగుండంలో నర్సింగ్ కాలేజీని ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా స్రిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News