Thursday, December 5, 2024

ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి అటవీ అనుమతులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ
రాసిన కేంద్ర అటవీశాఖ
అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్
జనరల్ హర్షం వ్యక్తం
చేసిన మంత్రి కోమటిరెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మంజూరు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర అటవీశాఖ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్ రావ్ భవర్ లేఖ రూపంలో తెలిపినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పంపిన లేఖలో రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) కు ప్రధాన సమస్యగా ఉన్న అటవీ భూములకు సంబంధించిన అనుమతులను ఇస్తూ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అనుమతుల ప్రకారం మెదక్ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్ధిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి -భువనగిరి జిల్లాలో 8.511 హెక్టార్లు మొత్తంగా మూడు జిల్లాల్లో కలిపి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని భారత్‌మాల పరియోజన ఫేజ్-1 కింద ఎన్.హెచ్.ఏ.ఐ క్రింద పీఐయూ (ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్) గజ్వేల్,

ప్రయోజనార్థం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు లేఖలో తెలిపారని మంత్రి తెలిపారు. అందుకు సంబంధించిన వివిధ నిబంధనల అమలుకు అనుగుణంగా అటవీ అనుమతులు లోబడి భూసేకరణ చేస్తామని పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలిపినట్లు మంత్రి తెలిపారు. అటవీ అనుమతుల సమస్య తీరడంతో ఇక ఎన్.హెచ్.ఏ.ఐ వద్ద పెండింగ్ లో ఉన్న టెక్నికల్ అప్రూవల్ వస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమవుతుందని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 90 శాతం భూసేకరణ పూర్తయ్యిందని, కొన్ని చిన్న చిన్న కోర్టు కేసుల భూములను త్వరలో పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని తెలిపిన మంత్రి ఇప్పుడు అటవీ అనుమతులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News